ఈనెల 15న వార్షిక పుష్పయాగ మహోత్సవం

ఈనెల 15న వార్షిక పుష్పయాగ మహోత్సవం

తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం మార్చి 15న నిర్వహించనున్నారు. ఆలయ ఉత్సవాల్లో భాగంగా మార్చి 14న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పుష్పయాగం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించనున్నారు.