అదుపుతప్పి లిక్కర్ వ్యాన్ బోల్తా

అదుపుతప్పి లిక్కర్ వ్యాన్ బోల్తా

జగిత్యాల: రాజారాం గ్రామ శివారులో జగిత్యాల-కరీంనగర్ రహదారిపై లిక్కర్ వ్యాన్ బోల్తా‌ కొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లిక్కర్ వ్యాన్ బోల్తా‌పడి.. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్దారు. వ్యాన్‌లో రూ.50లక్షల విలువ గల మద్యం బాటిల్లు ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.