'కొత్త చట్టంపై అవగాహన అవసరం'
VZM: ఉపాధి హామీ పథకం కొత్త చట్టంపై అవగాహన అవసరమని గజపతినగరం క్లస్టర్ ఏపీడీ కె.రమామణి అన్నారు. సోమవారం బొండపల్లిలో వికసిత్ భారత్-VB-G RAM G అవగాహన సదస్సు జరిగింది. 2026 మార్చి 31 వరకు పాత చట్టం పనిచేస్తుందన్నారు. కొత్త చట్టంపై సమాచారాన్ని సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాలాజీ, ఏపీవో జి.అరుణ కుమారి పాల్గొన్నారు.