భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్

NGKL: భూభారతి 2025 చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష అన్నారు. సోమవారం పెంట్లవెల్లి మండలం మహేశ్వరంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తుల స్వీకరించి రసీదులు అందించారు. రైతులకు వారి భూములపై పూర్తి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.