తుమ్మిడికుంట చెరువు పనులను పరిశీలించిన సీఎం
HYD: మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. హైటెక్స్‌లో నిర్వహించిన ఏషియన్ టెక్స్ టైల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో తుమ్మిడికుంట పునరుద్ధరణ పనులను పరిశీలించారు. నగరంలోని చెరువుల పునరుద్ధరణలో భాగంగా హైడ్రా తుమ్మిడి కుంటలో చెరువు పునరుజ్జీవం, సుందరీ కరణ పనులు చేపట్టింది.