ఆపరేషన్ చేశారు.. సర్జికల్ బ్లేడ్ వదిలేశారు..!

ఆపరేషన్ చేశారు.. సర్జికల్ బ్లేడ్ వదిలేశారు..!

PLD: బాలయ్యనగర్‌కు చెందిన రమా దేవి (22) ఇటీవల నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు డాక్టర్ నారాయణ స్వామి సిబ్బందితో కలిసి శాస్త్ర చికిత్స చేశారు. తర్వాత నొప్పి తీవ్రంగా రావడంతో డాక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమెకు స్కానింగ్ చేయగా తొడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయినట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళ ఖంగు తిన్నారు.