VIDEO: ఆలయ బిందెలో పాము.. భక్తుల పరుగులు
కోనసీమ: అమలాపురం రూరల్ మండలం పేరూరు అగ్రహారంలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో గురువారం రాత్రి పూజకు నీళ్లు తెచ్చే బిందెలో పాము దూరింది. దీనిని గమనించిన భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. స్థానికులు సమాచారంతో స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ అక్కడకు చేరుకుని చాకచక్యంగా త్రాచుపామును బంధించారు దీంతో అక్కడ ఉన్న వారు ఊపిరి పీల్చుకున్నారు.