'అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి'

ELR: నూజివీడు పట్టణంలోని అమర్ భవన్‌లో ఆదివారం అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ ముఖ్యల సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర సమితి నేత చలసాని రామారావు మాట్లాడుతూ.. 11 ఏళ్లుగా అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసానికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నట్లు చెప్పారు. మోసపోయిన ప్రజానీకానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.