'బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం'
GDWL: చిన్న వయస్సులో ఆడపిల్లలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం అని చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్ నరసింహులు స్పష్టం చేశారు. అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని ఆయన సూచించారు. బుధవారం ఆయన జిల్లాలోని జమ్మిచేడు ZPHS పాఠశాలలో విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.