VIDEO: వెలుగు చూసిన భారీ మోసం.. రూ.25 కోట్లు స్వాహ
AKP: జిల్లాలో అగరబత్తీల తయారీ స్కీం పేరుతో భారీ మెసం వెలుగు చూసింది. అనకాపల్లికి చెందిన వరదా మోహన్ కృష్ణ అనే వ్యక్తి రూ.లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.12,500 ఇస్తామని మహిళలను నమ్మించి రూ. 25 కోట్ల వసూలు చేశాడు. డబ్బులు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలని రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.