ఎల్లంపేట ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

MHBD: మరిపెడలోని ఎల్లంపేటకి చెందిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఐనాల మైసయ్యను శుక్రవారం సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ విజయ తెలిపారు. ఎల్లంపేట ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై విచారణ జరిపి డీఆర్డీఓ మధుసూదనరాజుకు సమర్పించామని, అందులో అవకతవకలు ఉండటంతో ఫీల్డ్ అసిస్టెంట్‌ను విధుల నుంచి తొలగించినట్లు ఆమె వెల్లడించారు.