ఆ కళాశాలలకు గమనిక

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2024-25 సంవత్సరంలోపు అఫిలియేషన్ ముగిసిన కళాశాల యాజమాన్యాలు తిరిగి అఫిలియేషన్ చేయించుకోవాలని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ మేరాజుల్లా ఖాన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 31వ తేదీలోపు అఫిలియేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కళాశాలల యాజమాన్యాలు ఉపయోగించుకోవాలన్నారు.