అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
KDP: ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులో ఇవాళ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ముద్దునూరు రోడ్డు నుంచి రాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టరుకు ఆటో అడ్డు రావడంతో ఆటోను తప్పించబోయి డ్రైవర్ డివైడర్ పైకి ఎక్కించాడు. దీంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది.