మోగల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

మోగల్లులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

W.G: పాలకోడేరు మండలం మోగల్లులో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలును పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు కాకుండా నేరుగా ప్రభుత్వానికి విక్రయించాలని ఆయన కోరారు. తుఫాన్ ప్రభావం వల్ల తడిచిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు మేలు చేస్తుందని తెలిపారు.