'నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి'
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని సీతారాం ఏచూరి నగర్ కాలనీలో నివసిస్తున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ సర్నపు సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం కాలనీ వాసులతో సమావేశమై సుమారు 700 కుటుంబాలు నాలుగేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.