బీజేపీలో చేరిన పలు పార్టీల నేతలు
WGL: నర్సంపేట మండల పరిధిలో ముత్తుజిపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువకులు బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి డా. రానా ప్రతాపరెడ్డి సమక్షంలో బీజేపీలోకి చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్‌ఎస్ పార్టీల తీరు నచ్చక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు.