VIDEO: కాలువలో పడి వ్యక్తి మృతి
BPT: కాలువలో పడి వలస కూలి మృతి చెందిన ఘటన శనివారం కొల్లూరులో జరిగింది. బంధువుల వివరాల మేరకు.. ఈపురుపాలెంకు చెందిన కందుకూరి చందు (30) కొల్లూరు ఇటుక బట్టీలో పనిచేయటానికి వెళ్లాడు. పని అయిన తర్వాత ఈవూరు వెళ్లే కరకట్ట పక్కనే ఉన్న పెద్ద కాలువలో స్నానానికి వెళ్లి మునిగిపోయాడు. తోటి కూలీలు కాపాడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.