కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు
KDP: ఒంటిమిట్ట మండలంలో ఓ బాలుడికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. చిన్న కొత్తపల్లిలో 11 కేవీ విద్యుత్ లైను తాకి లిఖిత్ కుమార్ (6) గాయపడ్డాడు. తుఫాన్ కారణంగా స్కూళ్లకు సెలవు ఉండటంతో ఇంటి వద్ద ఆటలాడుతూ ప్రహరీ గోడ ఎక్కిన సమయంలో తక్కువ ఎత్తులో ఉన్న తీగలు తగిలి కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కడపలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.