'ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలి'
KDP: దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్యను పెంచాలని డాక్టర్లకు, సిబ్బందికి DMHO డా. నాగరాజు తెలిపారు. శనివారం దువ్వూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆయన రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు.