జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించాం: కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించాం: కలెక్టర్

కోనసీమ: ముమ్మిడివరం మండల పరిధిలో అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు సమస్య పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలల స్థితిగతులు, వసతులు పట్ల ఆడిట్ నిర్వహించామని ఆయన వివరించారు.