ఐపీఎల్ బెట్టింగ్‌లో దిగితే జైలు శిక్షే: ఎస్పీ

ఐపీఎల్ బెట్టింగ్‌లో దిగితే జైలు శిక్షే: ఎస్పీ

GDWL: క్రికెట్ అంటే వినోదం, కానీ దాన్ని అక్రమ సంపాదనకు వాడితే అది మీ జీవితాలనే నాశనం చేస్తుంది అని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బెట్టింగ్ అక్రమమని, ఇందులో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి యువత ఆత్మహత్యలకు పాల్పడటం కుటుంబాలకు తీరని శోకంగా మిగులుతుందన్నారు.