బైక్‌పై వెళ్తూ కుక్క అడ్డుపడి..వ్యక్తి మృతి

GNTR: తెనాలి మండలం ఆఫ్పెట గ్రామానికి చెందిన సురేశ్ (35) శనివారం గుంటూరు నుంచి తన గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా, కుక్క అడ్డువచ్చింది. దీంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు, తలకు తీవ్ర గాయాలవ్వడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం సురేశ్ మృతిచెందాడు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.