మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

VZM: విజయవాడలో మంత్రి నిమ్మల రామనాయుడిని ఎమ్మెల్యే బేబీ నాయన నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల మరమ్మతులు, సాగునీటి సమస్యలపై మంత్రికి వివరించారు. సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.