ప్రజలకు ఇబ్బందులు పెట్టవద్దు: సీఐ
SDPT: గజ్వేల్ పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలిగేలా రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి సామాగ్రి పెట్టవద్దని ట్రాఫిక్ సీఐ మురళీ వ్యాపారస్తులను ఆదేశించారు. తన సిబ్బందితో కలిసి ఆయన ఫుట్‌పాత్‌లపై ఉంచిన వస్తువులను, సైన్ బోర్డులను తొలగించారు. రోడ్డు భద్రతా నియమాలను, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.