వాహనదారులకు బిగ్ అలర్ట్
రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజా వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు NHAI వెల్లడించింది. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. దయచేసి వాహనదారులు ప్రయాణానికి ముందు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాలని సూచించింది.