వావిలాలలో వైద్య శిబిరం
KNR: జమ్మికుంట బాలికల ప్రాథమిక పాఠశాలలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి దగ్గు, జలుబు, చిన్నచిన్న సమస్యలు ఉన్నవారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, వ్యాధులపై అవగాహన కల్పించారు.