VIDEO: జనగణనపై అవగాహన
SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనగణనపై జాతీయ సేవా పథకం అధికారి జే. రవిబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ మేరకు కళాశాల ఆవరణ నుంచి కోటి సెంటర్ వరకు మన లెక్కలు- మన భవిష్యత్తు అనే నినాదాలతో విద్యార్థులు ర్యాలీ చేపట్టి, మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణన ఆవశ్యకత గురించి వివరించారు.