VIDEO: 'ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు సురక్షితం'
JGL: ప్రభుత్వాసుపత్రిలోనే ప్రసవాలు సురక్షితమని మండల వైద్యాధికారి డా.నరేష్ అన్నారు.సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో గర్భిణీలకు "ఏఎన్సి డే"క్లినిక్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా గర్భిణీలకు పలు టెస్టులు నిర్వహించి చికిత్సలు అందించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.