ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా భోగి సెలబ్రేషన్స్

మేడ్చల్: ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మీ మాధవి ఆధ్వర్యంలో భోగి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ లక్ష్మీ మాధవి మాట్లాడుతూ.. తమ సిబ్బందితో భోగి పండుగ జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఈ ప్రభాకర్ బాల నరేష్ ఏఎస్సైలు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.