'డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని వినతి'

'డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని వినతి'

NRML: ఖానాపూర్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ఆర్‌సీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఖానాపూర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.