మరమ్మతులకు నోచని పైప్‌లైన్లు
MNCL: జన్నారం మండల కేంద్రంలోని వివిధ కాలనీలలో మిషన్ భగీరథ పైప్‌లైన్ల నుంచి నీరు వృధాగా పోతోంది. దీంతో నీరు అందడం లేదని పలు కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలో ఉన్న మేదరి కాలనీకి వెళ్లే రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలిపోయింది. దీంతో రహదారిపై నీరు వృధాగా పోతోంది. వేసవి కావడంతో నీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని ప్రజలు వాపోయారు.