'సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలి'

'సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలి'

KMM: సీసీఐ నిబంధనలు సడలించి పత్తి కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం సుందరయ్య భవన్ మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పంటలకు చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 19-25 వరకు గ్రామాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రదర్శనలు ఉంటాయన్నారు.