ఉపాధి హామీ పనులు ప్రారంభం
ADB: నార్నూర్ మండలంలోని చొర్గావ్ గ్రామంలో ఇవాళ ఉపాధిహామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎండాకాలం దృష్ట్యా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని సర్పంచ్ కుమ్ర ధర్ము తెలిపారు. కూలీలు తప్పకుండ పనులకు హాజరుకావాలని, ఆన్‌లైన్ ద్వారా హాజరు వివరాలు నమోదు ఉంటుందని టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ సూచించారు.