యాదాద్రి నృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

యాదాద్రి నృసింహుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

నల్గొండ: ప్రసిద్ద పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మి నృసింహుడి సన్నిధిలో శుక్రవారం నిత్య పూజలు శాస్రోక్తంగా నిర్వహించారు. వేకువజామున స్వామి వారికి సుప్రభాత పూజలు జరిపి అభిషేకం,అర్చన ,బాలభోగం నిర్వహించారు. సుదర్శన నరసింహ హోమం జరిపి వేదమంత్రాలు , మంగళ వాయిద్యాల మద్యన నిత్య కల్యాణం వైభవం గా జరిపారు. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ నిర్వహించారు.