ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

VZM: ఎల్.కోట మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా లలిత కుమారి మాట్లాడుతూ.. ప్రజాదర్బార్‌లో 10 వినతులు వచ్చాయని వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.