పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

WGL: నూతన సంవత్సర వేళ ట్రై సిటీ పరిధిలో మంగళవారం రాత్రి పోలీసుల బందోబస్త్ ఏర్పాట్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధానముగా మద్యం సేవించి వాహన డ్రైవింగ్‌ను కట్టడి చేయడంతో పాటు వాహనాలు వేగంగా పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు.