పంద్రాగస్టుకు పురకార్యాలయం ముస్తాబు

కోనసీమ: స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అందరికీ పండగే. 79వ భారత స్వతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా మండపేట పుర పాలక సంఘం కార్యాలయంకు ప్రత్యేక విద్యుత్ అలంకారం చేశారు. జాతీయ జెండా లోని తీవర్ణ రంగులుతో సీరియల్ సెట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పట్టణం విద్యుత్ కాంతులతో కొత్త సోయగాన్ని రూపుదిద్దుకుంది.