మంత్రి చొరవతో యువకుడికి పునర్జన్మ

మంత్రి చొరవతో యువకుడికి పునర్జన్మ

సత్యసాయి: కదిరికి చెందిన ఎం. చరణ్ కుమార్ గుండె శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సోమవారం ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి మంత్రి చొరవతో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగి పునర్జన్మ లభించింది. ఈ సందర్భంగా చరణ్ కుమార్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.