పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
BHPL: గోరికొత్తపల్లి మండలం జగ్గయ్యపేటలో ఈరోజు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.20 లక్షలతో నిర్మితమైన రామగుండాలపల్లి రోడ్డు నుంచి పంటపొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్డు, రూ.10 లక్షలతో నిర్మించిన స్మశానవాటిక రోడ్డును ప్రారంభించారు. అనంతరం కరెంట్ షాక్‌కు గురై ఇంట దగ్గర చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్త మల్లయ్య ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.