శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో మరో 2 గేట్లు మూసివేశారు. 7 గేట్ల ద్వారా 1,87,852 క్యూసెక్కులు దిగువన సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 3,24,618 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,80,230 క్యూసెక్కులు విడుదలవుతోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.30 అడుగులు ఉంది. నీటి సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 200.65 టీఎంసీలు ఉంది.