వవ్వేరులో నేరాల నియంత్రణ, చట్టాలపై అవగాహన

వవ్వేరులో నేరాల నియంత్రణ, చట్టాలపై అవగాహన

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వవ్వేరులో నేరాల నియంత్రణ, చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని సీఐ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పరస్పరం స్నేహభావంతో, ఐక్యంగా జీవించాలన్నారు. గ్రామంలో అనుమానాస్పద పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.