VIDEO: బద్వేలులో పెట్రోల్ బంకు వద్ద మంటలు
KDP: బద్వేలు పట్టణం నెల్లూరు రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ బంక్ పరిసరాల్లో చెత్త లేకుండా జాగ్రత్తలు పాటించాలని పలువురు సూచించారు.