ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ, తెలంగాణ గీతాలు ఆలపించారు. సీపీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణకు ముఖ్యమైన రోజు అని, నిజాం పాలన వ్యతిరేక పోరాటాల ఫలితమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.