గంగూరులో గ్రీన్ షాపును ప్రారంభించిన ఎమ్మెల్యే
కృష్ణా: మోడల్ గ్రీన్ షాపు ఏర్పాటుకు ప్రభుత్వం పెనమలూరు (M) ఎంపిక చేసినట్లు JC నవీన్ తెలిపారు. తొలిసారి గంగూరులో ఏర్పాటు చేసిన ఈ షాపును జేసీ MLA ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. వారంలో ఒకసారి మాత్రమే స్వచ్ఛరథాల ద్వారా వ్యర్థ, పనికిరాని వస్తువులను సేకరిస్తున్నారని, ఇకపై శాశ్వత గ్రీన్ షాపుల ఏర్పాటు ద్వారా నిత్యం ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.