పశువులకు ఉచిత వైద్య శిబిరం
VZM: బొబ్బిలి మండలం వెలగవలస గ్రామంలో ఏఎంసీ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత వైద్య శిబిరం, అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేబీనాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భకోశ వ్యాధులు, యదకు రాకపోవడం తదితర సమస్యలతో ఉన్న పశువులను పరీక్షించి టీకాలను, మందులను ఉచితంగా అందజేశారు.