తెనాలిలో సచివాలయ ఉద్యోగుల నిరసన

GNTR: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల JAC ఆధ్వర్యంలో గురువారం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. క్లస్టర్ మ్యాపింగ్ విధానం వల్ల ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.