బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను విస్మరించింది: జంగా

JN: జఫర్గఢ్ మండలం కూనూరులో 44వ సబ్ జూనియర్ బాల్ బ్యాట్మింటన్ పోటీలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి హాజరై మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వం క్రీడలను విస్మరించిందని, CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ MLA అరూరి రమేష్ పాల్గొన్నారు.