దరిమడుగులో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

దరిమడుగులో 'కోటి సంతకాల సేకరణ' కార్యక్రమం

ప్రకాశం: మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు చేపట్టారు. ముఖ్య అతిథిగా ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేసేందుకే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.