'పౌల్ట్రీ అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టాలి'

'పౌల్ట్రీ అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టాలి'

ADB: సోనాల మండల కేంద్రంలో పొలాలకు వెళ్లి రహదారిపై అక్రమంగా పౌల్ట్రీ నిర్మాణం చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భీమ్ ఆర్మీ అసెంబ్లీ ప్రెసిడెంట్ భగత్ ప్రవీణ్ గురువారం అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా పౌల్ట్రీ ఫామ్ రహదారిపై నిర్మించడం సబబు కాదన్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు దారి లేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.