'నేటి తరానికి బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడు'
NRML: నేటి తరానికి బాబు జగ్జీవన్ రామ్ ఆదర్శప్రాయుడని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ వెనుకబడిన కులాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.